Breaking News

మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంలో స్టార్ హీరోయిన్ !

Published on Wed, 11/22/2023 - 13:01

నాలుగు పదుల వయసులో వరుస అవకాశాలతో  దూసుకెళుతున్న హీరోయిన్ నయనతార. దక్షిణాదిలోనే కాకుండా ఇటీవల బాలీవుడ్‌ చిత్రం జవాన్‌తో సక్సెస్‌ కొట్టింది. ఒక పక్క నటన, మరో పక్క పిల్లల బాధ్యత, ఇంకో పక్క వ్యాపారం అంటూ బిజీగా జీవితాన్ని గడుపుతోంది. 75 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా హీరోయిన్‌గా ఎక్కడా ఫుల్‌స్టాప్‌ లేదంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. 75వ చిత్రంగా మాధవన్‌, సిద్ధార్థ్‌లతో టెస్ట్‌ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా  కథానాయకిగా నటించిన మరో చిత్రం అన్నపూరణి. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా మరో నూతన చిత్రానికి నయనతార గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అరుణ్‌రాజా కామరాజ్‌ దర్శకత్వం వహించనున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటించనున్నారని తెలిసింది. నటుడిగా సినీరంగానికి పరిచయం అయిన అరుణ్‌రాజా కామరాజ్‌ ఆ తరువాత గాయకుడు, గీత రచయితగా తనలోని ప్రతిభను నిరూపించుకుని ఆపై దర్శకుడిగా కనా చిత్రంతో పరిచయమయ్యారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈయన ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా నెంజిక్కు నీతి చిత్రం చేసి సక్సెస్‌ అయ్యారు. తాజాగా లేబుల్‌ అనే వెబ్‌సిరీస్‌ చేశారు. నటుడు కార్తీ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అది ఏమైందో గానీ తాజాగా నయనతార హీరోయిన్‌గా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ రేర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?