Breaking News

జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?

Published on Wed, 08/16/2023 - 07:35

లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఇప్పుడు షారుక్ ఖాన్ సరసన జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఆమె చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న నయనతార సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. అంతేకాకుండా పర్సనల్‌ లైఫ్‌లోనూ ఆమె వివాదాలు వెంటాడాయి. అలా అన్నింటినీ అధిగమించి ఇప్పుడిప్పుడే తన ఇద్దరు పిల్లలతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. 

(ఇది చదవండి: నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి)

అయితే ప్రస్తుతం ఆమె నటించిన జవాన్ వచ్చేనెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఆమె తొలి చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నయన్  ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది.

తన సొంత చిత్రాలకు నయనతార ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపేస్తూ ఉంటోంది. అలాంటి బాలీవుడ్ అరంగేట్ర చిత్రమైన జవాన్‌ ప్రమోషన్లలో నయన్ కనిపించకపోవడం అభిమానుల్లో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. మరో విషయమేంటంటే ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన దీపికా పదుకొణే షారుక్‌తో కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇంతకీ జవాన్‌లో లీడ్‌ రోల్‌ చేసింది నయనాతారనా లేక దీపికనా అంటూ ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఇదే విషయం అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవలే మరో నటి కస్తూరి నయనతారను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను లేడీ సూపర్‌ స్టార్‌ గా భావించలేమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
(ఇది చదవండి: రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!)

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)