Breaking News

మళ్లీ సక్సెస్‌ బాట పట్టేందుకు ప్లాన్‌ చేస్తున్న నయనతార

Published on Thu, 02/15/2024 - 09:31

నయనతార వంటి ప్రముఖ నటీనటులకు అవకాశాలు తగ్గే చాన్స్‌ ఉండదు. ఒకవేళ తగ్గినా వారే స్వయంగా చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతారు. కాగా ప్రస్తుతం నయనతారకు అవకాశాలు తగ్గే అవకాశమే లేదు. అయితే విజయాలకు దూరం అవుతున్న ఈ లేడీ సూపర్‌స్టార్‌ మళ్లీ సక్సెస్‌ బాట పట్టే ప్రయత్నంలో సొంతంగా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల జయంరవి సరసన నటించిన ఇరైవన్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.

ఆ తరువాత నటించిన లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రం 'అన్నపూరణి' కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం మాధవన్‌, సిద్ధార్థ్‌తో కలిసి టెస్ట్‌ చిత్రంలో ఆమె నటిస్తుంది. కాగా భర్త విఘ్నేష్‌ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా పలు చిత్రాలను నిర్మించడంతో పాటు, అనేక సినిమాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశారు.

తాజాగా సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో నటించడానికి నయనతార సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రాలు నయనతార విఘ్నేష్‌ శివన్‌ తమ రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైన ఈ చిత్రంతో హిట్‌ కొట్టాలని ఆమె ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కనెక్ట్‌ చిత్రం తరువాత రౌడీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించే చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది కచ్చితంగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా వెలువడాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)