Breaking News

విఘ్నేశ్‌తో జీవితం పంచుకోకుంటే బాగుండేది: నయనతార

Published on Fri, 12/13/2024 - 21:28

విఘ్నేశ్‌ లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉందంటోంది నయనతార. కానీ తన వల్ల అతడు విమర్శలపాలవుతున్నాడని, అదే సహించలేకపోతున్నానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. జీవితాన్ని కలిసి పంచుకోకపోయుంటే బాగుండేదేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. తనను ఈ రిలేషన్‌షిప్‌లోకి లాగినందుకు గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే ఫీలవుతున్నాను. 

ప్రేమను పంచుకోవాలి కానీ..
మా రిలేషన్‌లో నేనే మొదటి అడుగు వేశాను. నేనే గనక అతడి జీవితంలో లేకపోయుంటే అతడి ప్రతిభను గుర్తించేవారు. డైరెక్టర్‌గా, రచయితగా, గేయరచయితగా తనకు క్రెడిట్‌ ఇచ్చేవారు. విఘ్నేశ్‌ మంచి మనసున్న వ్యక్తి. నేను కూడా మంచిదాన్నే. కానీ తనంత మంతనమైతే నాలో లేదనుకుంటా! సక్సెస్‌ అయిన మనుషులు తమతో సమానంగా సక్సెస్‌ అయినవారినే పెళ్లి చేసుకోవాలని జనం ఆలోచిస్తారు. ఇక్కడ మీరు ప్రేమను ఎంచుకోవాలి తప్ప విజయాలను, డబ్బును, లగ్జరీని కాదు! అప్పుడే మీరు మరింత ప్రేమలో పడతారు.

అందుకేనేమో..
విఘ్నేశ్‌ నాకంటే ఆలస్యంగా కెరీర్‌ ప్రారంభించాడు. నేను అతడికంటే సీనియర్‌ను. అతడు వరుస బ్లాక్‌బస్టర్స్‌ ఇవ్వలేదనో, తన సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయనో కానీ విఘ్నేశ్‌ను చాలామంది ట్రోల్‌ చేస్తుంటారు. నేను ఆల్‌రెడీ సక్సెస్‌ అయిపోయి, నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అతడు ఇంకా తన స్థానం సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు. అందుకేనేమో అతడిపై ఎక్కువ ద్వేషం, చులకన! అని నయనతార చెప్పుకొచ్చింది.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)