Breaking News

మరో ఓటీటీకి నయనతార వివాదాస్పద సినిమా.. వారికి మాత్రమే!

Published on Tue, 09/30/2025 - 16:45

కోలీవుడ్ భామ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్'. 2023లో వచ్చిన ఈ సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి థియేటర్ల వద్ద మిక్స్‌డ్‌ రివ్యూస్ వచ్చాయి. ఇందులో నయన్ బ్రహ్మణి అమ్మాయి పాత్రలో కనిపించింది. అదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు చేసే చెఫ్‌గా చూపించడం ఆ వర్గం మనోభావాలు దెబ్బతీసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించగా.. నయనతార క్షమాపణలు చెప్పింది.

తాజాగా ఈ  చిత్రం మరో భాషలో అందుబాటులోకి వస్తోంది. అక్టోబర్ 1 నుంచి జియో హాట్‌ స్టార్‌లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఇన్ని రోజుల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అన్నపూరణి సినిమాను జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లపై ఆర్. రవీంద్రన్ మరియు జతిన్ సేథి నిర్మించారు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు.  ప్రస్తుతం ఈ చిత్రం సింప్లీ సౌత్‌ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కేవలం ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌కు మాత్రం అందుబాటులో ఉంది. 
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)