Breaking News

చిరంజీవితో సినిమా.. భారీగా డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్!

Published on Tue, 05/06/2025 - 07:28

సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న హీరోయిన్లే ఎక్కువ. కానీ ఈ రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చి ఎండింగే లేదంటున్న హీరోయిన్లు ఉండడం విశేషమే. అలాంటి అతి తక్కువ మంది కథానాయికల్లో నయనతార ఒకరు. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌కు ఒకటి రెండు ఫ్లాప్‌లు ఎదురైతే కేరీర్‌ తలకిందులవుతుంది. అలాంటిది నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయింది.

ఆ మధ్య ఈమె నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం అన్నపూరిణి నిరాశ పరిచింది. ఇటీవల కథానాయకిగా నటించిన టెస్ట్‌ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించలేక పోయింది. మరో పక్క పెళ్లి, భర్త, ఇద్దరు కవల పిల్లలు అంటూ సంసార జీవితం. అయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అయితే ఈమె తొలి సారిగా బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌తో జంటగా నటించిన జవాన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆ చిత్రానికి రూ.12 కోట్లు వరకూ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

అయితే తమిళ చిత్రాలకు అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారా అంటే సందేహమే. అలాంటిది తాజాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. తెలుగులో చిరంజీవికి జంటగా ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని.. అందులో నటించడానికి నయనతార రూ.18 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాతల వర్గం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్‌. ఇదే కనుక నిజం అయితే దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నిలిచిపోతుంది. ఇకపోతే ఈమె ఇంతకు ముందు చిరంజీవితో సైరా, గాడ్‌ ఫాదర్‌ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)