Breaking News

భర్తతో నయనతార ఎప్పటికీ విడిపోదు.. అసలు సీక్రెట్‌ ఏమిటంటే

Published on Tue, 03/12/2024 - 09:58

సౌత్‌ ఇండియాలో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్‌ నయనతార. ఆమె సినీ పయనం ఒక సంచలనం. అవమానాలు, ఆరోపణలు, వివాదాలమయ జీవితం. అయితే అందులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ అకుంఠిత శ్రమతో నంబర్‌ వన్‌ నటి అనే అంతస్తులో నిలిచారు. సూపర్‌ స్టార్‌గా అత్యంత అధిక పారితోషికం తీసుకుంటున్న ఇండియన్‌ నాయకిగా రాణిస్తున్నారు. రెండు మూడు సార్లు ప్రేమలో ఓడిపోయి చివరికి దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ ప్రేమను పొంది, ఆయనతో గత రెండేళ్ల క్రితం ఏడు అడుగులు వేశారు.

ఇప్పుడు వీరికి ఉయిర్‌, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కథానాయకిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార తనకు సంబంధించిన సినీ, వ్యక్తిగత విషయాలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఎంటర్‌ టైన్‌ చేయడంతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పదమైన విషయాలను పొందుపరుస్తూ షాకింగ్‌కు గురి చేస్తుంటారు. భర్త విగ్నేష్‌ శివన్‌, పిల్లలు ఉయిర్‌, ఉలగంతో ఎంతో అన్యోన్యంగా ఉండే నయనతార ఇటీవల తాను ఓడిపోయాను అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో చేసిన పోస్ట్‌ అందరిని షాక్‌కు గురి చేసింది.

దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌తో మనస్పర్థలా? ఇద్దరు విడిపోతున్నారా? అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది? అంటూ పలు ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆ వెంటనే తన భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలను ఆమె పోస్ట్‌ చేశారు. దీంతో అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్‌ అని తేలిపోయింది. కాగా నయనతార విగ్నేష్‌ శివన్‌ విడిపోతారనే పదానికే తావు లేదని విశ్లేషకులు అంటున్నారు. నయనతార ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించడానికి సలహాలు ఇచ్చిందే విగ్నేష్‌ శివన్‌ అని, ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తులు, చేస్తున్న వ్యాపారాలకు ఆమె భర్త విగ్నేష్‌ శివన్‌ ఫౌండర్‌గానో, కో ఫౌండర్‌గానో ఉన్నారని, కాబట్టి విడిపోయే ఛాన్సే లేదని విశ్లేషకులు చెబుతున్న మాట.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)