Breaking News

క్రేజీ డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌లోకి నయనతార

Published on Sat, 02/17/2024 - 07:50

తమిళ చిత్ర పరిశ్రమలో వెట్రిమారన్‌కు దర్శకుడిగా, నిర్మాతగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆడుగళంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే ఆ చిత్ర కథానాయకుడు ధనుష్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందించారు. ఆ తర్వాత విచారణై, అసురన్‌, విడుదలై ఇలా వరుసగా వైవిద్యభరిత కథా చిత్రాలను రూపొందిస్తున్నారు. అదేవిధంగా గ్రాస్‌ రూట్‌ ఫిలిమ్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఉదయం ఎల్‌హెచ్‌ 4, పొరియాళన్‌, కాక్కా ముట్టై, విచారణై, వడ చైన్నె వంటి సక్సెస్‌ చిత్రాలను నిర్మించారు.

ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న వెట్రిమారన్‌ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. విశేషమేమిటంటే ఇందులో నయనతార నాయకిగా నటించబోతున్నారట. బిజీగా ఉన్న ఈ భామ త్వరలో తన సొంత బ్యానర్‌ రౌడీ పిక్చర్స్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించి, ప్రధాన పాత్రలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనికి వెట్రిమారన్‌ శిష్యుడు విక్రమన్‌ అశోకన్‌ దర్శకత్వం వహించారన్నారు. ఇందులో నటుడు కవిన్‌ కథానాయకుడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ రేర్‌ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)