Breaking News

20 రోజులు దూరంగా.. భర్త కోసం అల్లాడిపోయిన నయనతార

Published on Thu, 03/28/2024 - 07:53

కోలీవుడ్‌లో సంచలన జంట ఎవరైనా ఉన్నారంటే అది నయనతార, విఘ్నేశ్‌ శివన్‌నే. వీరు సుదీర్ఘ ప్రేమలో ఉన్న తరువాత పెళ్లికి సిద్ధం అయ్యారు. 2022 జూన్‌ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. అలాగే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వారికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. పెళ్లికి ముందు వరకూ పుట్టిన రోజులు, పండుగలు అంటూ ట్రిప్పుకు వెళ్తూ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేవారు.

రాక కోసం ఎదురుచూశాం
ఇప్పుడు తమ కవల పిల్లలతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా విదేశానికి వెళ్లిన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ఎంతగానో మిస్‌ అయ్యామంది నయనతార. తాను, తన పిల్లలు అతడి రాకకోసం ఎదురు చూశామని, విఘ్నేశ్‌ శివన్‌ తిరిగి వచ్చిన తరువాత ఎంత ఆనందంగా ఫీల్‌ అయ్యారో తెలుపుతూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫోటోలు షేర్‌ చేసింది.

మాటల్లో చెప్పలేం..
విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం ఏల్‌ఐసీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ కోసం ఇటీవల సింగపూర్‌ వెళ్లారు. ఈ చిత్రం సింగపూర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా నయనతార తన ఇన్‌స్ట్రాగామ్‌లో '20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. నిన్ను ఎంతో మిస్‌ అయ్యాం' అని పేర్కొన్నారు. అందులో పిల్లలతో కలిసున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)