Breaking News

ప్రారంభమైన నయనతార కొత్త చిత్రం

Published on Fri, 10/13/2023 - 11:54

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌ లోనూ విజయాన్ని అందుకున్న ఈ భామ 75 చిత్రాల మార్క్‌ను దాటేశారు. ప్రస్తుతం 76వ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి 'మన్నాంగట్టి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. దీన్ని ఇంతకు ముందు సర్దార్‌ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్‌.లక్షమణన్‌ తన ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

ఈ చిత్రం ద్వారా యూట్యూబర్‌ డూడ్‌ విక్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు యోగిబాబు, గౌరీ కిషన్‌, దేవదర్శిని, నరేంద్ర ప్రసాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఆర్‌డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం, శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోడైక్కానల్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది పిరియడ్‌ కథాంశంతో వైవిధ్యభరిత కథనంతో రూపొందుతున్న చిత్రం అని యూనిట్‌ వర్గాలు తెలిపారు.

కాగా కోలమావు కోకిల, ఐరా చిత్రాల తరువాత నయనతార, యోగిబాబు కాంబినేషన్లో రూపొందటంతో ఈ మన్నాంగట్టి చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. కాగా నయనతార టెస్ట్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తుండడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)