Breaking News

దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి

Published on Mon, 04/28/2025 - 10:25

బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ (Sajid Khan) తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటోంది బుల్లితెర నటి నవీనా బోలె (Navina Bole). గతంలో అతడి వల్ల ఎదురైన ఓ ఇబ్బందిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. నవీనా బోలె మాట్లాడుతూ.. ఓ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడాలని సాజిద్‌ పిలిస్తే అతడి ఆఫీసుకు వెళ్లాను. అతడు చేసిన పనికి.. జీవితంలో అతడిని కలవకూడదని ఫిక్సయ్యాను.

ఇదేం పరీక్ష?
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆఫీసుకు వెళ్లాక ప్రాజెక్ట్‌ గురించి చెప్తాడేమో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ అతడు.. నీ దుస్తులు తీసేసి కూర్చోవచ్చుగా అని అడిగాడు. నీ శరీరంపై నీకెంత నమ్మకం ఉంది? దుస్తులు లేకున్నా సౌకర్యంగా కూర్చోగలవా? లేదా? అని టెస్ట్‌ చేస్తున్నాను అన్నాడు. ఇది 2004 లేదా 2006లో జరిగిందనుకుంటాను. అతడి మాటలకు నా నోరు మూగబోయింది. నేనేం సమాధానమివ్వలేదు. ఏమైంది? నువ్వు బికినీ వేసుకుంటావుగా.. అలాంటప్పుడు ఇదేం పెద్ద సమస్య కాదు.. నువ్వు నీలా ఉండు అంతే అన్నాడు. 

ఇంటికెళ్లి వస్తానని తప్పించుకున్నా..
అలాగైతే నేను ఇంటికెళ్లి బికినీ తెచ్చుకుంటాను. అంతే తప్ప నీ ముందు దుస్తులు తీసేసి కూర్చోలేను అని చెప్పాను. తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను. అప్పటికీ ఆయన వదల్లేదు. ఇంటికి చేరుకున్నావా? ఆఫీసుకు తిరిగొస్తానన్నావ్‌, ఇంకా రావడం లేదేంటి? అంటూ దాదాపు 50 సార్లు ఫోన్‌ చేశాడు అని చెప్పుకొచ్చింది.

సాజిద్‌ ఖాన్‌పై గతంలోనూ ఆరోపణలు
ఇకపోతే 2018లో మీటూ ఉద్యమం ఉధృతమైన సమయంలో సాజిద్‌ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నటి రాచెల్‌ వైట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సలోని చోప్రా, జర్నలిస్ట్‌ కరిష్మా ఉపాధ్యాయ.. సాజిద్‌ ఖాన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే నవీనా బోలె.. మిలే జబ్‌ హమ్‌ తుమ్‌, జెన్నీ ఔర్‌ జుజు, సప్నా బబుల్‌ కా, బిడాయి, ఇష్క్‌బాజ్‌ వంటి హిందీ సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది.

చదవండి: ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్‌ తాగా: నటుడు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)