Breaking News

నవీన్‌ పోలిశెట్టికి లక్కీచాన్స్‌ వరించనుందా..?

Published on Mon, 05/19/2025 - 07:06

టాలీవుడ్ హీరో‌ నవీన్‌ పోలిశెట్టి జాక్‌పాట్‌ కొట్టబోతున్నారా? ఈ యువ నటుడికి డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్‌ వరించనుందా..? ఈ క్రేజీ చిత్రంలో ఆ స్టార్‌ కథానాయకి నటించి ఉన్నారా..? దీనికి సంబంధించిన వార్తనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇండియన్‌ సినిమా బుక్‌లో దర్శకుడు మణిరత్నం పేరు ఎప్పటికీ ప్రముఖంగానే ఉంటుంది. రజనీకాంత్, కమలహాసన్‌ వంటి ప్రముఖ నటులతో చిత్రాలు చేసి విజయాన్ని సాధించారు.

 ప్రస్తుతం కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు నటించిన థగ్‌ లైఫ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నలకు పలు రకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హాల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా  నవీన్‌ పోలిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

నవీన్‌ పోలిశెట్టి ఇంతకుముందు తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి వంటి సక్సెస్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సాయిపల్లవి కథానాయకిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక పర్యటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)