Breaking News

ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: నాగవంశీ

Published on Fri, 01/16/2026 - 16:45

త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను’ అన్నారు యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి.

నవీన్పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రంఅనగనగా ఒక రాజు’.నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం నెల 14 ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టాక్ని సంపాదించుకుంది. నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.

సందర్భంగా నవీన్పొలిశెట్టి మాట్లాడుతూ.. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాం. నాకు రాజ్‌కుమార్ హిరానీ గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది. ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నిర్మాత నాగవంశీ హృదయపూర్వక ధన్యవాదాలుఅన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు. ఎందరో సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించిందిఅన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)