CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
Breaking News
తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి: నవీన్ పొలిశెట్టి
Published on Wed, 12/31/2025 - 12:16
‘వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంలో మీ ముందుకు మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దాం అనుకున్నాను. కానీ, 2024లో జరిగిన ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల నేను షూటింగ్ కి దూరమయ్యాను. మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే అదే సమయంలో మా బృందంతో కలిసి ఈ 'అనగనగా ఒక రాజు' కథ రాసుకోవడం జరిగింది. మీ అందరి ప్రేమతోనే మేము ఈ సినిమా షూటింగ్ ని సరదాగా ఆరు నెలల్లో పూర్తి చేయగలిగాం. జనవరి 14న విడుదలవుతున్న 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని మీరు కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అన్నారు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో 'రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక'ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్ కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి వల్లే ఇంతటి వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాం. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఒక వైబ్ ఉంటుంది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగను తీసుకొని వస్తుంది. తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘ఇది నా మూడో సంక్రాంతి సినిమా. 'అనగనగా ఒక రాజు'లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాపై మీరు చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’అన్నారు.
Tags : 1