అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
జాతిరత్నాలు హీరోకు యాక్సిడెంట్?
Published on Thu, 03/28/2024 - 10:45
జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా వీధుల్లో బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన చేతికి ఫ్రాక్చర్ అయిందట! చేతికి బలమైన గాయం అవడం వల్ల రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ హీరో కొంతకాలంపాటు సెట్‌కు దూరంగా ఉండాల్సిందేనన్నమాట! ఈ యాక్సిడెంట్ వార్తలపై నవీన్ స్పందించాల్సి ఉంది.
కాగా నవీన్ పొలిశెట్టి చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేశాడు. ఇందులో అనుష్కతో జోడీ కట్టాడు. పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ మూవీని వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం నవీన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.
చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ఒక్క పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ!
Tags : 1