TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ
Breaking News
నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్.. భయపెడుతోన్న టీజర్
Published on Tue, 01/20/2026 - 20:30
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా వస్తోన్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీ. ఈ చిత్రంలో దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హనీ టీజర్ చూస్తుంటే క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అనే ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందించారు.
Silence carries the loudest fear.
Some secrets demand silence.
Some demand sacrifice.
This Year’s Most Devastating Ritual Starts From NOW 🔥
Watch Teaser Now 👇https://t.co/rvG68XlA3G
Honey Movie - Worldwide Grand Release In Theaters From Feb 6th 🐈⬛ 🔴 @Naveenc212… pic.twitter.com/o9toWlbEqq— Actor Naveen Chandra (@Naveenc212) January 20, 2026
Tags : 1