Breaking News

ఓటీటీలో తెలుగు బోల్డ్‌ సినిమా 'లవ్‌ మౌళి'

Published on Sat, 06/22/2024 - 20:20

నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందంటూ చిత్ర యూనిట్‌ భారీగానే ప్రమోషన్స్ చేసింది. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త బోల్డ్‌ కంటెంట్‌తో ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా కాస్త అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్‌గా ‍ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' అధికారికంగా ప్రకటన చేసింది. 'లవ్ మౌళి' చిత్రం జూన్‌ 27నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని ఆ సంస్థ తెలిపింది. రిలేషన్‌లో ఉన్న ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో కథ ఉంటుంది.

కథేంటి?

మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు.

కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ?

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)