Breaking News

రెండున్నరేళ్లు ఒకే గెటప్‌లో ఉన్నాను: నవదీప్‌

Published on Fri, 06/07/2024 - 00:33

‘‘లవ్‌ మౌళి’ సినిమా షూటింగ్‌ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేశాం. ఎన్నో వ్యయ ప్రయాసలతో అక్కడ షూట్‌ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎప్పుడూ వర్షం పడే ఆ ప్రదేశంలో సినిమా మీద ప్యాషన్‌తో షూటింగ్‌ చేశాం. ఈ సినిమాలోని నా పాత్ర కోసం రెండున్నరేళ్లు ఒకే గెటప్‌లో ఉన్నాను. ‘లవ్‌ మౌళి’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని హీరో నవదీప్‌ అన్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్‌ హీరోగా నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవదీప్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ప్రారంభంలో జెట్‌ స్పీడులో వెళ్లింది. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్లుగా కెరీర్‌ మార్చుకోవాలనిపించింది. ఆ సమయంలో విన్న కథే ‘లవ్‌ మౌళి’. ఇది రెగ్యులర్‌ ప్రేమకథ కాదు. అందరికీ కనెక్ట్‌ అవుతుంది.

ముఖ్యంగా యువతకు కచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది. ‘లవ్‌ మౌళి’ విజయంతో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ అవుతుందనుకుంటున్నాను. సరదాగా హీరో రానాకు ఈ చిత్రకథ చెప్పాను. కథ బాగుండటంతో అఘోరా పాత్ర చేశాడు. ప్రస్తుతం తమిళంలో నిత్యా మీనన్‌తో ఓ సినిమా, అలాగే ‘న్యూసెన్స్‌ 2’ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. నేను నటించిన మరికొన్ని వెబ్‌ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.

Videos

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

50 భాషల్లో కళ్ళు చెదిరేలా మహేశ్ బాబు వారణాసి

సాక్షి ఇంపాక్ట్.. ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఫేక్.. ఖోఖో అసోసియేషన్ సంచలన లేఖ

గంటలో 104 మి. మీ వర్షం.. జపాన్ ను ముంచేసిన వరద

అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..

పర్చూరుపై జగన్ ఫోకస్.. నేతలతో కీలక భేటీ

DSCలో అక్రమాలు నిజమేనని అధికారులు మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు

Photos

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)