Breaking News

హీరో నాని చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘అల్లూరి’ మూవీ ట్రైలర్‌

Published on Fri, 09/16/2022 - 18:23

యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే క‌థ‌లే కాదు, ఆయ‌న న‌టించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయ‌న ఎక్కువ‌గా మొగ్గు చూపుతుంటాడు. దానివ‌ల్ల ఈ త‌రం వాళ్ల‌లో కొంత‌మందికైనా కొన్ని మంచి ప‌దాలు తెలుస్తాయంటాడీ హీరో. ఇప్పుడు ఈ యంగ్‌ హీరో ‘అల్లూరి’ చిత్రంతో అలరించబోతున్నాడు. ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశాడు. ‘లక్ష్యసాధనకు పడిన శ్రమ గొప్పది’ అంటూ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌ వస్తుండగా పోలీసు ఆఫీసర్‌గా శ్రీవిష్ణు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత పోలీసులు నిజమైన హీరోలు అంటూ చెప్పే డైలాగ్‌, యాక్షన్స్‌ సీన్స్‌, లవ్‌ యాంగిల్‌ వంటి ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్‌ అద్యంతం ఆకట్టుకుంటుంది.

ఇక ఊహించిన రితీలో ఉన్న యాక్షన్‌ సీన్స్‌  ప్రేక్షకుల చేత ఈళలు వేయించడం ఖాయం అంటున్నారు. సమాజం బాగుపడాలంటే రాజకీయ నాయకులను కూడా మార్చాలని హీరో సవాలు విసరడం, అలాగే, ఎక్కువ మంది పిల్లలు పోలీసు అధికారులుగా మారాలని కోరుకుంటున్నానంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్స్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.  ఈ సినిమాలో శ్రీవిష్ణు మరోసారి తన మార్క్‌ చూపించాడని ఈ ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైలెట్‌ అని చెప్పవచ్చు. ఇలా సాంతంగా ఆసక్తిగా సాగిన ట్రైలర్‌ ప్యాన్స్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా తనికేళ భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్‌, సుమన్‌, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. సెప్టెంబర్‌ 23న ఈచిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.  

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)