Breaking News

అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ మూవీ సత్తా.. అవార్డులు కొల్లగొట్టేసింది!

Published on Tue, 11/26/2024 - 14:39

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌ హిట్‌ మూవీ హాయ్ నాన్న. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. శౌర్యువ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సలార్‌ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది.

తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మెక్సికోలో జరిగిన ఐఎఫ్‌ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్‌ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్‌ ఫీచర్‌ సౌండ్‌, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. కాగా.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్‌ చిత్రంగా హాయ్ నాన్న తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ మార్చ్- 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది.

కథ విషయానికి వస్తే..

ముంబైకి చెందిన విరాజ్‌ (నాని) ఓ ఫోటోగ్రాఫర్‌. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్‌. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్‌ ఫస్ట్‌ వస్తే చెప్తానంటాడు.

అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్‌ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్‌ సింగిల్‌ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే!

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)