Breaking News

జాతీయ అవార్డ్​ విజేతలకు దక్కే ప్రైజ్​మనీ ఎంతో తెలుసా?

Published on Sat, 08/26/2023 - 10:24

'పుష్ప' ఇప్పుడు దేశంలో​ ట్రెండింగ్​లో ఉన్న పేరు ఇదే. ఈ సినిమాతో అల్లు అర్జున్ నటనకుగాను తాజాగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ అవార్డు అందుకుంటున్న టాలీవుడ్‌ తొలి హీరో కూడా ఆయనే.. ఈ అవార్డుతో పాటు విజేతలకు కేంద్ర ప్రభుత్వం ఏమేం ఇస్తుందని సోషల్‌మీడియాలో నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు  వెతుకుతున్నారు.

జాతీయ చలనచిత్ర అవార్డలను అందుకున్న విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని అందిస్తారు. అంతేకాకుండా గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా అందిస్తారు. కానీ జ్యూరీ నుంచి  అభినందనలు అందుకున్న సినిమాల విషయంలో కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు మాత్రం ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తారు.

(ఇదీ చదవండి: డిసెంబర్‌ 12న విడుదల కానున్న రజనీకాంత్‌ మరో సినిమా)

2021 ఏడాదికి గాను 69వ జాతీయ అవార్డు అందుకోబోతున్న వారి జాబితా ఇప్పటికే విడుదలైంది. ఇందులో భాగంగా ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్‌లకు ఒక్కోక్కరికి రూ.50 వేల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

► ఉత్తమ చిత్రం అవార్డుల కోసం 28 భాషల నుంచి 280 సినిమాలు పోటీ పడితే.. బెస్ట్ మూవీగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌కు  రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు.

► ఉత్తమ వినోద చిత్రం అవార్డు కోసం  23 భాషల నుంచి 158 చిత్రాలు పోటీపడగా ఈ అవార్డుకు ఎంపికైన RRR సినిమాకు రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం దక్కించుకోనుంది.

► గోదావరి అనే మరాఠ సినిమాకు బెస్ట్ డైరెక్టర్​గా  జాతీయ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్‌కు  రూ.2.50 లక్షల నగదు బహుమతి, రజత కమలం అందుకుంటారు

► ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్​కు రూ. 1.50 లక్షల నగదుతో పాటు రజత కమలం అందుకుంటారు. ఈ సినిమాకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే

► జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన షేర్షా సినిమాకు రూ.2 లక్షల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)