Breaking News

టాలీవుడ్‌: జాతీయ అవార్డ్‌ గ్రహీత 'దాసి' సుదర్శన్‌ కన్నుమూత

Published on Tue, 04/02/2024 - 07:38

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న దాసి సుదర్శన్‌ (73) మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చిత్రకారుడు దాసి సుదర్శన్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. మిర్యాలగూడ స్వస్థలమైనప్పటికీ వృత్తిరీత్య నాగార్జున్‌సాగర్‌లోని హిల్‌ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా తన జర్నీని ప్రారంభించారు.

1988లో 'దాసి' సినిమాకు గాను ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న పిట్టంపల్లి సుదర్శన్‌  ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆ సినిమా వల్ల  'దాసి' సుదర్శన్‌గా గుర్తింపు పొందారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాణించారు. అంతేకాకుండా రచయితగా, పాత్రికేయుడిగా, ఫొటోగ్రాఫర్‌గా,కార్టూనిస్టుగా కూడా ప్రసిద్ధికెక్కారు.

1988 లో విడుదలైన తెలుగు సినిమా దాసి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు తెరకెక్కించారు.  అలనాటి తెలంగాణలో దొరల నిరంకుశ పాలనలో చితికిపోయిన గ్రామ ప్రజల జీవితాలను ప్రతిబింబించిన చిత్రం. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తూ ఆద్యంతం వాస్తవికధోరణిలో రూపొందించబడింది. ఈ చిత్రానికి దు జాతీయ అవార్డులను దక్కించుకోగా అందులో సుదర్శన్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా అవార్డు పొందారు. ఆ తర్వాత జాతీయ అవార్డుల జ్యూరీలో సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు. సుదర్శన్‌ అంత్యక్రియలు మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)