Breaking News

విక్రమ్‌ సినిమాలో అడుగుపెడుతున్న క్రేజీ నటుడు

Published on Tue, 03/05/2024 - 11:12

తంగలాన్‌ చిత్రాన్ని పూర్తి చేసిన సియాన్‌ విక్రమ్‌ తాజాగా తన 62వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఎస్‌జే సూర్య ముఖ్య పాత్రను పోషించనున్నారు. కాగా తాజాగా ప్రముఖ మలయాళ నటుడు ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. హాస్య నటుడిగా బహుళ ప్రాచుర్యం పొంది మూడుసార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందుకున్న సురాజ్‌ వెంజారమూడు 2016లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నారు.

ఈయన మలయాళంలో నటించిన ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, జన గణమన, ది గ్రేట్‌ ఇండియన్‌ కిచ్చెన్‌ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా విక్రమ్‌ కథానాయకుడిగా నటించనున్న తన 62వ చిత్రం ద్వారా సురాజ్‌ కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఇందులో ఈయన ముఖ్య పాత్రను పోషించనున్నట్లు చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పలు ఓటీటీలలో ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో కూడా ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది.

ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ క్రేజీ చిత్రం సెట్‌ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌