Breaking News

ప్రశాంత్‌, శివాజీ ముందే ప్లాన్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్

Published on Thu, 10/26/2023 - 11:53

బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 దాదాపు సగానికి పైగానే పూర్తి అయింది. ఇప్పటికే ఏడు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. ఉల్టాపుల్టా పేరుతో రతికా రోజ్‌ రీ ఎంట్రీ వల్ల షో పట్ల మరింత బజ్‌ క్రియేట్‌ చేయాలని బిగ్‌ బాస్‌ ప్లాన్‌ చేశాడు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆటలో వినిపించే బూతులను కూడా టెలికాస్ట్‌ చేస్తున్నారు. భోలే, అమర్‌ చేసిన వ్యాఖ్యలు అందులే భాగమే... ఇన్నీ చేస్తున్నా ఆడియన్స్‌లో అనుకున్నంత రీచ్‌ అయితే ఈ సీజ్‌న్‌ చేరుకోలేదని తెలుస్తోంది.

తాజాగా ఈ సీజన్‌పై  కొరియోగ్రాఫర్, డాన్సర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ తనదైన స్టైల్లో పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్‌,యావర్‌,రతికా రోజ్‌, అమర్‌ వంటి వారి ఆటతీరుపై ఆయన స్పందించాడు. సమాజంలో పొలిటికల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకునేందుకే శివాజీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలాంటి మాయమర్మం చేయకపోతే జనాలు నమ్మరు. ఉదాహరణకు సత్యసాయిబాబ నోటి నుంచి శివలింగం, చేతి నుంచి విభూతి తీసి ప్రజలను ఎలా నమ్మించారో తెలిసిందే.

(ఇదీ చదవండి: నా మొదటి లిప్ లాక్ సీన్ ఎవరితో అంటే.. ఊహించని ఆన్సర్‌ ఇచ్చిన శ్రీలీల)

అలాగే శివాజీ కూడా ఒక రైతు బిడ్డకు (పల్లవి ప్రశాంత్‌) సాయం చేస్తూ తన ఇమేజ్‌ను చూపించుకునేందుకు, ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ప్లాన్‌ చేస్తున్నాడని అర్థం అవుతుంది. హౌస్‌లో ప్రశాంత్‌,యావర్‌కు మాత్రమే శివాజీ సపోర్ట్‌గా ఉంటున్నాడు. వారిద్దరు కాకుండా మరో వ్యక్తి ఉంటే చూపించండి. యావర్‌కు పెద్దగా తెలుగు రాదు కాబట్టి కొంత వరకు మొదట్లో ఇబ్బంది పడ్డాడు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్‌ అవుతుంది. మన ఇండియన్స్‌ అంతా సెంటిమెంట్‌కు పడిపోతాం అది మన బ్లడ్‌లోనే ఉంది. అందుకే రైతు బిడ్డ అని చెప్పగానే ప్రశాంత్‌పై సానుభూతితో కూడిన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది.

ప్రశాంత్‌ గెలిస్తే శివాజీ ఎందుకు..?
ఈ పాయింట్‌నే తెలివిగా శివాజీ అందిపుచ్చుకున్నాడు. అందుకే ప్రశాంత్‌కు ప్రతి విషయంలో శివాజీ సపోర్ట్‌ చేస్తున్నాడు. వీరిద్దరూ కూడా బిగ్‌బాస్‌ ఎంట్రీకి ముందే బయట మాట్లాడుకుని వెళ్లారని తెలుస్తోంది. ఇది నా అభిప్రాయం. వారిద్దరూ సోషల్‌ మీడియాలో గుర్తింపు ఉన్న ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు వేరువేరుగా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే బిగ్‌బాస్‌లోకి వచ్చారు. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే వారి ప్లాన్‌ను  అమలు చేశారు. అందులో భాగంగానే ప్రశాంత్‌ నువ్వు గెలవాలి రా అని శివాజీ పదేపదే అంటున్నాడు. ప్రశాంత్‌ గెలిస్తే బిగ్‌బాస్‌లోకి శివాజీ ఎందుకు వెళ్లినట్లు అని నటరాజ్‌ ప్రశ్నించాడు.

అంతేకాకుండా చాలామంది యూట్యూబర్స్‌, పలు సోషల్‌ మీడియాలను రన్‌ చేస్తున్న వారిని పల్లవి ప్రశాంత్‌ ముందే కలిసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని నటరాజ్‌ మాస్టర్‌ చెప్పాడు. బిగ్‌ బాస్‌లోకి వెళ్లాలని అతను గత మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌ పేజీలు ఉన్న వాళ్లందరినీ ప్రశాంత్‌ ముందే కలిశాడు. ఇలా గ్రౌండ్‌ వర్క్‌ చేసే బిగ్‌ బాస్‌లోకి వెళ్లాడు. వాటంన్నిటికీ తోడు శివాజీ ఇస్తున్న సపోర్ట్‌ వల్ల కూడా ప్రశాంత్‌ స్ట్రాంగ్‌ అయ్యాడు. కానీ  రైతు బిడ్డలా మాత్రం హౌజ్‌లో ప్రశాంత్‌ కనిపించడంలేదు. అతనిపై సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. అతని నామినేషన్‌ ప్రక్రియ చూస్తున్నప్పుడు ఆ సినిమాల ప్రభావం ఈజీగా కనిపిస్తుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)