Breaking News

ఆ సినిమాల్లో నన్ను చూసి నాకే ఛీ అనిపించింది : శర్వానంద్‌

Published on Tue, 01/20/2026 - 16:41

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌కి చాలా గ్యాప్‌ తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్‌పడింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్ర..తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. పండక్కి ఎక్కువ సినిమాలు ఉండడంతో తొలి రోజు చాలా తక్కువ థియేటర్స్‌లో సినిమా రిలీజ్‌ అయింది. అయితే తొలి రోజే హిట్‌ టాక్‌​ రావడంతో థియేటర్స్‌ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కలెక్షన్స్‌ కూడా భారీగా వస్తున్నాయి. 

చాలా రోజుల తర్వాత తన సినిమాకు హిట్ టాక్‌ రావడం ఆనందంగా ఉందంటున్నాడు శర్వానంద్‌. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన పాత చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూసుకుంటే.. తనకే ఆసహ్యం కలుగుతుందని చెప్పారు. 

‘జాను(2019) సినిమా సమయంలో నాకు మేజర్‌ యాక్సిడెంట్ జరిగింది. నా చేయి కూడా పని చేయదని చెప్పారు. కానీ దేవుడి దయ, సంకల్ప బలంలో త్వరగానే రికవరీ అయ్యాను. అయితే ఆ సమయంలో నేను చాలా లావు అయిపోయాను. ‘శ్రీకారం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో చాలా లావుగా కనిపిస్తాను. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాలు చూస్తే.. ‘ఛీ ఛీ..ఎలా ఉన్నా? నన్ను చూసి టికెట్స్‌ ఎందుకు తెగాలి?’ అనిపించింది. 

అందుకే సినిమాల ఫెయిల్యూర్‌కి నేను కూడా ఒక కారణం అని భావించా. నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. ముందుగా నా శరీరాన్ని మునుపటి మాదిరిగా మార్చాలనుకున్నా. ముందుగా వాకింగ్‌ ప్రారంభించాను. ఆ తర్వాత రన్నింగ్‌, యోగా చేస్తూ డైటింగ్‌ చేశా.ఇప్పుడు నా లుక్‌ మారింది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో స్టైలీష్‌గా ఉన్నానని చెబుతున్నారు. బైకర్‌లో కూడా అలానే కనిపిస్తా.ఇకపై అన్ని మంచి సినిమాలు అందించడానికే కృషి చేస్తా’ అని శర్వా చెప్పుకొచ్చాడు. 
 

Videos

TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ

సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ఎంట్రీ..

జగన్ పై తప్పుడు రాతలు ఆంధ్రజ్యోతి పేపర్ ను తగలబెట్టిన YSRCP

బీఆర్ఎస్ VS పోలీస్ .. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద హైటెన్షన్

ఏ క్షణమైనా యుద్ధం.. రంగంలోకి ఫ్రాన్స్, జర్మనీ బలగాలు

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..

రక్తం కారేలా కొట్టుకున్న TDP, జనసేన కార్యకర్తలు

Varudu: బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..

నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి

చంద్రబాబుపై కేసులు ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఆగ్రహం

Photos

+5

సీతాకల్యాణం చేసిన 'బిగ్‌బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)

+5

2016లో సారా టెండుల్కర్‌ ఇలా.. పోస్ట్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

ఫ్యాషన్ ..అదిరెన్: కనువిందు చేసిన ఫ్యాషన్ షో (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

వాఘా బోర్డర్‌లో 'ధురంధర్' బ్యూటీ (ఫొటోలు)

+5

సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ -ఎంత బాగుందో! (ఫొటోలు)

+5

అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్‌లో ఇలా (ఫొటోలు)

+5

టిల్లుగాని పోరీ.. మతిపోయే గ్లామరస్‌గా (ఫొటోలు)

+5

'శుభకృత్ నామ సంవత్సర' మూవీ ఈవెంట్‌లో పవిత్ర, నరేష్‌ (ఫోటోలు)

+5

టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)