Breaking News

సీక్రెట్‌గా పెళ్లి.. తొలిసారి భర్తతో మీడియా ముందుకు హీరోయిన్‌

Published on Sun, 08/31/2025 - 17:10

బాలీవుడ్‌ హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రి (Nargis Fakhri) ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త టోనీ బేగ్‌ (Tony Beig)ను పెళ్లాడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో వివాహ తంతు పూర్తి చేసుకుని అట్నుంచటే కొత్త దంపతులు స్విట్జర్లాండ్‌ వెళ్లారు. అయితే తనకు మ్యారేజ్‌ అయిందని నర్గీస్‌ ఎక్కడా చెప్పలేదు, అలాగే పెళ్లి ఫోటోలు కూడా షేర్‌ చేయలేదు. ఇంతవరకు జంటగా కనిపించిందీ లేదు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తొలిసారి భర్తతో కనిపించిందీ బ్యూటీ. ముంబైలో నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (NMACC)లో ఆగస్టు 30న జరిగిన ఓ కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది.

పెళ్లయ్యాక తొలిసారి..
వీరితో కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌ (Farah Khan) కూడా జత కలిసింది. రెడ్‌ కార్పెట్‌పై నర్గీస్‌, ఫరా ఖాన్‌ జంటగా ఫోటోలు దిగారు. అనంతరం ఫరా.. నీ భార్య పక్కన వచ్చి నిల్చో అంటూ టోనీని పిలిచింది. దీంతో వారిద్దరి పెళ్లి జరిగిపోయిందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. నర్గీస్‌ ఫక్రి.. మద్రాస్‌ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్‌ 3, అమావాస్‌... తదితర సినిమాల్లో నటించింది. హాలీవుడ్‌  సినిమా  ‘స్పై’లోనూ అలరించింది. చివరగా హౌస్‌ఫుల్‌ 5 మూవీలో కనిపించింది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.288 కోట్లు రాబట్టింది.

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)