Breaking News

Malli Pelli Teaser: నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!

Published on Fri, 04/21/2023 - 11:54

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. అయితే అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు నరేశ్- పవిత్ర.  ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాతే తెలిసింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ చిత్రానికి‌ ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది.

లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా  విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన‍్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)