Breaking News

డర్టీ హరి చూసి ఆయనకు ఫ్యాన్‌ అయిపోయా: నరేశ్‌

Published on Thu, 05/11/2023 - 13:02

సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఎమ్‌ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. నరేశ్‌ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నరేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'అమ్మకు గుడి కట్టడంతో నా పని అయిపోలేదు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే విజయకృష్ణ మూవీస్‌ను రీ లాంఛ్ చేశాను. ఎంఎస్‌ రాజు డైరెక్ట్‌ చేసిన డర్టీ హరి చూసి ఫ్యాన్‌ అయిపోయాను. మూడేళ్ల నుంచి రాజుగారితో ప్రయాణిస్తున్నాను. టీజర్‌, ట్రైలర్‌లో కంటే సినిమాలో ఇంకా మంచి కంటెంట్‌ ఉంది. అమ్మానాన్న కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్‌లో వచ్చిన మళ్లీ పెళ్లి సినిమా టైటిల్‌నే మా సినిమాకు వాడుకున్నాం' అన్నాడు నరేశ్‌.

నటి పవిత్రా లోకేశ్‌ మాట్లాడుతూ.. 'నటీనటులను పాంపర్‌ చేసే దర్శకుడు ఎంఎస్‌ రాజు. ఆయన ఒక అన్నగా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సినిమాలో నా పాత్రకు వంద శాతం న్యాయం చేశాననుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కినన్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్‌ కుమార్‌, అనన్య నాగళ్ల, రోషన్‌, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, ప్రవీణ్‌ యండమూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి స్వరాలు, అరుల్‌ దేవ్‌ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి