'వార్‌ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్‌

Published on Fri, 08/22/2025 - 12:13

నారా రోహిత్‌ హీరోగా నటించిన 'సుందరకాండ' చిత్రం ఆగస్టు 27న రిలీజ్‌ కానుంది.  ఈ క్రమంలో తన మూవీ ప్రమోషన్స్‌ కోసం ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కూలీ, వార్‌2 సినిమాలు చూశారా..? ఎలా ఉన్నాయంటూ ఆయన్ను ప్రశ్నించారు. ఈ సందర్భంలో రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఎన్టీఆర్‌ సినిమా విడుదలైతే తప్పకుండా తన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అభిమానులు చూస్తారు. అయితే, కొంత కాలంగా తారక్‌ను నందమూరి, నారా ఫ్యామిలీలు దూరంగానే ఉంచుతూ వస్తున్నాయి. వార్‌ 2 మూవీ విడుదల సమయంలో తారక్‌పై టీడీపీ ఎమ్మెల్యేనే భూతులతో విరుచుకుపడ్డాడు. 

అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో వార్‌2 సినిమా చూశారా అని 'నారా రోహిత్‌'ని ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. 'వార్‌ 2 సినిమా చూడలేదు. మా గ్యాంగ్‌ అంతా కూలీ సినిమా చూద్దాం అన్నారు. అప్పుడు నేనూ కూడా 'కూలీ' కోసమే వెళ్లాను. సినిమా అక్కడక్కడ నచ్చింది. ఓవరాల్‌గా పర్వాలేదు. వార్‌2 చూడలేదు. కానీ, సమయం దొరికితే తప్పకుండా చూస్తాను.' అని అన్నారు. అయితే, ఇక్కడ నారా రోహిత్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు. మొదట కుటుంబ సభ్యుల సినిమాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

తారక్‌తో తనకు మంచి స్నేహం ఉందని నారా రోహిత్‌ (Nara Rohith) అన్నారు. ఎక్కడైనా తాము ఎదురైతే మంచిగానే మాట్లాడాతుమాన్నారు. కానీ, పెద్దగా ఫోన్స్‌లలో మాట్లాడుకోవడం వంటివి మాత్రం లేవన్నారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)