Breaking News

స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను: నాని

Published on Sun, 03/16/2025 - 10:43

నాని(Nani) తన వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే హిట్‌ టాక్‌ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. 

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. నేను ఈ రోజుదాక స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీంని గెలిచింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో, టీం విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. ఈ వీకెండ్ ఒక పండగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెలుతున్న అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. బలగం హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు రామ్ జగదీశ్ ఈ కథ చెప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యాను. మాకు సపోర్ట్ గా దీప్తి అక్క, ప్రశాంతి గారు వచ్చారు. మేమంతా రాకెట్ లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాక తీసుకెళ్ళారు. ఆయన నమ్మకపోయుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు.

యాక్టర్ శివాజీ మాట్లాడుతూ... 25 ఏళ్ళుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశాను. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కల వుంటుంది. ఒక రోజు మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలని. అది ఈ సినిమాతో తీరింది. మంగపతి లాంటి పాత్ర లైఫ్ లో ఒకేసారి వస్తుంది. ఆ కిక్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఇకపై సినిమాలు చేస్తాను'అన్నారు.   ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ రామ్‌ జగదీశ్‌, నటులు హర్షవర్దన్‌, రోహిణి, శుభలేఖ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)