Breaking News

'హిట్ 3' కోసం అనిరుధ్.. వీడియో సాంగ్ రిలీజ్

Published on Fri, 04/25/2025 - 17:14

నాని(Nani) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హిట్ 3(HIT 3 Movie). మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ముంబయి, కేరళ అంటూ నాని తెగ తిరిగేస్తున్నాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా నుంచి ఇప్పుడో పాట రిలీజ్ చేశారు. దీన్ని అనిరుధ్ పాడటం విశేషం.

హిట్ 3 మూవీ నుంచి ఇదివరకే ప్రేమ వెల్లువ, అభీ బార్ అర్జున్ సర్కార్ అనే పాటలు రిలీజయ్యాయి. ఇప్పుడు 'తను..' అంటే సాగే గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్ లో ఉన్న నాని.. హీరోయిన్ కోసం పాడే సాంగ్ ఇదని అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 

దీన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పాడాడు. స్వతహాగా సినిమాలకు కంపోజ్ చేసే అనిరుధ్.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ పాడటానికి మాత్రం రూపాయి కూడా తీసుకోడు. గతంలో అతడే ఈ విషయం చెప్పాడు. 

ఇప్పుడు కూడా నాని కోసమే అనిరుధ్ ఈ పాట పాడినట్లు అనిపిస్తుంది. గతంలో నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. నెక్స్ట్  రాబోయే 'ప్యారడైజ్' కూడా ఇతడే సంగీతమందించబోతున్నాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా హిట్ 3లో అనిరుధ్ పాట పాడినట్లున్నాడు.

(ఇదీ చదవండి: పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్) 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)