Breaking News

దసరా డిలీటెడ్‌ సీన్‌: గిదే నీ ఇల్లు... లోపలికి పోవే.. నీ బాంచెనే..

Published on Sun, 04/09/2023 - 19:32

తెలంగాణ యాసకు పట్టం కడుపుతోంది తెలుగు ఇండస్ట్రీ. ఒకప్పుడు విలన్లు, కమెడియన్ల నోటి నుంచి మాత్రమే తెలంగాణ యాసభాష వినిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. హీరోలు కూడా ఎట్లైతే గట్లాయే చూస్కుందాం.. అని తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నారు. అలా నాని కూడా దసరాతో చేసిన ప్రయోగం సక్సెసైంది. డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తొలి చిత్రంతోనే మంచి మార్కులు పట్టేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ డ్యాన్స్‌ అయితే ఇప్పటికీ సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్‌ చేసిన ఓ సన్నివేశాన్ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. నిన్నే.. అంత కానిదాన్నైపోయినా.. ఆడెవడో వచ్చి తాళి కడతాంటే ఆపేది పోయి ఇంక మీదకెళ్లి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నవ్‌, నువ్వసలు తల్లివేనా? అంటూ కీర్తి సురేశ్‌ డైలాగ్‌తో వీడియో మొదలైంది. అందరూ కూడా నా బతుకును ఎట్ల చేశిర్రో చూశినవా అని అత్త ముందు ఆవేదన వ్యక్తం చేసింది వెన్నెల.

వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి.. 'గిదే నీ ఇల్లు. ఈడ్నే నీ బతుకు.. నా మాట విని లోపలికి పోవే.. నీ బాంచెనే' అంటూ వెన్నెలను బతిమాలుకుని వెళ్లిపోతుంది. మోడువారిన చెట్టులా అక్కడే నిలబడిపోతుంది వెన్నెల. మరోవైపు ఈ సంభాషణంతా అక్కడే గోడ వెనుక ఉన్న ధరణి(నాని) వింటాడు. ఈ వీడియో చూసిన జనాలు ఇది సినిమాలో ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)