Breaking News

'కాలం గడిచే కొద్ది మరింతగా మిస్ అవుతున్నా'.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

Published on Sun, 09/28/2025 - 18:05

ఒకటో నంబర్‌ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన  నందమూరి తారకరత్న.. హీరోగానే కాకుండా విలన్‌గానూ అభిమానులను అలరించారు. టాలీవుడ్‌లో పలు సినిమాలతో ఫ్యాన్స్‌ను మెప్పించారు. కానీ ఊహించని విధంగా చిన్న వయసులోనే అభిమానులకు, ఇండస్ట్రీకి దూరమయ్యారు. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

అయితే తాజాగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నను గుర్తు చేసుకుంది. నీతో  ఉన్న రోజులు జీవితమంతా మర్చిపోలేనంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.  ఇటీవల మహాలయ అమావాస్య సందర్భంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.


అలేఖ్య తన పోస్ట్‌లో రాస్తూ..'నా మనసులో భరించలేని బాధ ఉంది. అది ఎప్పటికీ మానిపోని గాయమని తెలుసు. నా మనసులోని ప్రతి విషయం ఎలా వక్రీకరించబడిందో చూసి నేను బాధపడ్డా. నీ కళ్లు శాశ్వతంగా మూసుకున్న తర్వాతే నీ కోరిక నెరవేరింది. అదే క్షణంలో మిగతావన్నీ కూడా నీతో పాటే వెళ్లిపోయాయి. ప్రస్తుతం నాకు బాధ కలిగించే రోజుల్లో.. నీ కథను తిరిగి వ్రాయడానికి చాలా ఆసక్తిగా ఉన్న ప్రపంచంలో ప్రయాణిస్తున్నా. కాలం గడిచే కొద్దీ మరింతగా నిన్ను మిస్ అవుతున్నా. కొన్ని రోజుల పాటు గాలి పీల్చుకోవడానికి చాలా బరువుగా అనిపిస్తోంది. దుఃఖం నా గొంతును చుట్టుకున్నట్లు, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా.. అయినప్పటికీ నేను ఆశను వదులుకోను.. ఎందుకంటే నీ హృదయ స్పందన ఇప్పటికీ నా కోసం చేరుకునే చిన్న చేతుల ద్వారా బ్రతికే ఉంది.. నిన్ను ఎప్పటికీ గుర్తుచేస్తుంది' ‍అంటూ ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)