Breaking News

తారకరత్న చివరి కోరిక ఇదే.. అది నెరవేరకుండానే!

Published on Sun, 02/19/2023 - 09:23

నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్న ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. తారకరత్న రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. అటు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిందని టాక్‌ నడిచింది. ఈ క్రమంలోనే లోకేశ్‌తో ఆ మధ్య భేటీ కూడా అయ్యారు.

మర్యాదపూర్వక భేటీగా బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ పరిణామాలతో పాటు పోటీ చేసే స్థానంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి తోడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి సిద్ధమయ్యాను, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని ఆయన ఓ సందర్భంలో చెప్పడంతో ఆ రూమర్స్‌ నిజమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే జోరుగా పర్యటనలు చేశారు. కానీ ఇంతలోనే  చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఇంత చిన్నవయసులోనే తారకరత్నను తీసుకెళ్లి దేవుడు ఇంత అన్యాయం చేశాడేంటి? అని అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

చదవండి: ఇంత చిన్నవయసులోనే వెళ్లిపోయావా?: తారకరత్న మృతిపై సంతాపం

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)