Breaking News

బాలయ్య మాస్‌ ర్యాగింగ్‌.. ఏయ్‌ ఆపు, ఊరికే లొడలొడా వాగుతున్నావ్‌..

Published on Fri, 06/30/2023 - 12:10

జగపతిబాబు, ఆశిష్‌ గాంధీ, విమలా రామన్‌, మమతా మోహన్‌దాస్‌, గానవి లక్ష్మణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రుద్రంగి. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించాడు. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం (జూన్‌ 29న) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై ఉన్న యాంకర్‌ సుమపై ఆయన సెటైర్లు వేశారు.

ముందుగా రుద్రంగి సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోష్స్‌ చేస్తున్న జగపతిబాబుపై ప్రశంసలు కురిపించింది సుమ. అతడిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మైక్‌ జగపతిబాబు చేతికి అందించింది. జగపతిబాబు స్పీచ్‌ మొదలుపెట్టేలోపు పక్కనే ఉన్న బాలయ్య ఏయ్‌, ఆపు.. ముందు మాట్లాడనివ్వు.. ఓ లొడలొడా వాగేస్తున్నావ్‌.. అన్నాడు. దీంతో సుమ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్టేజీ పై నుంచి వెళ్లిపోయింది. తర్వాత కాసేపటికే స్టేజీపైకి వచ్చిన ఆమె.. బాలకృష్ణను మాట్లాడాల్సిందిగా కోరుతూ అతడి చేతికి మైక్‌ ఇచ్చింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. 'బాలయ్యబాబు సెక్సీ అంటే విమలా రామన్‌, మమతా మోహన్‌దాస్‌.. వాళ్లంతా ఎంత జెలసీగా ఫీలవుతారు? కదా! అయినా ఇంతకుముందు సుమ ఒక మాట అంది. నేను ఏమీ మాట్లాడకముందే అభిమానులు చప్పట్లు కొడతారంది. ఈవిడకు అప్పుడప్పుడూ చెంపదెబ్బలు అవసరం. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఈమె తిరిగి చెప్పు తీసుకుని కొడుతుంది.. అదొక బాధ మళ్లీ! పాపం రాజీవ్‌ కనకాల ఎలా భరిస్తున్నాడో..' అంటూ సుమను టీజ్‌ చేశాడు.

చదవండి: చనిపోయే కొద్ది గంటలముందు అవి కావాలన్న సౌందర్య

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)