Breaking News

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌

Published on Sat, 01/25/2025 - 21:10

హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది. సినీరంగంలో అందించిన సేవలకుగానూ ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించనుంది. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా (జనవరి 25న) కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్‌ చేసింది.

సినీ ప్రస్థానం
నటుడిగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి చైర్మన్‌గా  బాలకృష్ణ సేవలందిస్తున్నారు. ఈయన తాతమ్మ కల(1974) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించారు.

సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. క్యాన్సర్ బారినపడ్డ ఎంతో మందికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్సను అందిస్తున్నారు.

చదవండి: సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్‌..? ఆర్జీవీ ఏమన్నారంటే?

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)