Breaking News

సెల్ఫీ కోసం వెళ్తే తల మీద ఒక్కటిచ్చిన నటుడు, వీడియో వైరల్‌

Published on Wed, 11/15/2023 - 13:51

అభిమాన తారలు కనిపిస్తే చాలు ఫోటో దిగాలని, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు జనాలు. కొందరు సెలబ్రిటీలు ఓపికగా చిరునవ్వుతో వారికి సెల్ఫీ ఇవ్వడానికి ముందుకొస్తే మరికొందరు మాత్రం అభిమానులను పట్టించుకోకుండా హడావుడిగా వెళ్లిపోతుంటారు. అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్‌ మాత్రం తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్‌మని కొట్టాడు.

మెడ పట్టి గెంటేశారు
ఓ అభిమాని నానా పటేకర్‌ కనిపించగానే ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్‌ దురుసు ప్రవర్తనను ఎండగడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సౌమ్యంగా చెప్పొచ్చుగా, ఎందుకలా కొట్టడం అని విమర్శిస్తున్నారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటన వారణాసిలో జరిగినట్లు తెలుస్తోంది.

సినిమాల సంగతి..
కాగా మీటూ ఉద్యమం సమయంలో నానా పటేకర్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. కానీ విచారణలో తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తేలింది. ఏదేమైనా మీటూ వివాదం ఆయన కెరీర్‌కు మచ్చ తెచ్చింది. దీంతో కొంతకాలం మీడియాకు, సినిమాలకు దూరగా ఉన్న ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరగా వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్‌ వార్‌ సినిమాలో నటించాడు.

చదవండి: చైతూ తొలి వెబ్‌ సిరీస్ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడు?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)