Breaking News

బిగ్‌బాస్‌ హౌస్‌లో మహేశ్ బాబు మరదలు.. తెలుగులో ఓకే ఒక్క సినిమా!

Published on Mon, 10/07/2024 - 13:25

‍బుల్లితెర ప్రియులను ‍అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పటికే తెలుగులో ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం వెల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిది మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే అదే రోజు హిందీతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ సీజన్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 6 నుంచి హిందీ బిగ్‌బాస్ సీజన్-18 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ  ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

అయితే ఈ సీజన్‌లో టాలీవుడ్ హీరో మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హౌస్‌లో అడుగుపెట్టింది. నమ్రతా శిరోద్కర్ చెల్లి అయిన శిల్పా బిగ్‌బాస్ సీజ‌న్ 18లోకి నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు బిగ్‌బాస్‌ షో అంటే విపరీతమైన అభిమానమని.. నా కల నిజమైన క్షణమని సంతోషం వ్యక్తం చేశారు. నా ప్రయాణం పట్ల ఆనందంగా ఉన్నట్లు శిల్పా శిరోద్కర్ అన్నారు. బిగ్‌బాస్ ద్వారా త‌న జీవితంలో మ‌రో కొత్త అధ్యాయం మొద‌లైంద‌ని తెలిపారు. బిగ్‌బాస్‌లోకి వెళ్ల‌మ‌ని కూతురు ఎప్పుడు త‌న‌ను అడుగుతుండేద‌ని శిల్పా శిరోద్క‌ర్ వెల్లడించారు. అంద‌రికంటే ఎక్కువ త‌న కూతురు సంతోషంగా ఉందని పేర్కొంది.

(ఇది చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!)

1990 ద‌శ‌కంలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శిల్పా శిరోద్క‌ర్‌. బాలీవుడ్‌లో బందీష్, మృత్య్‌దండ్‌, హ‌మ్‌, త్రినేత‌ లాంటి సినిమాల్లో నటించారు. మోహ‌న్‌బాబు హీరోగా న‌టించిన బ్ర‌హ్మ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మూవీ ఇదే కావడం విశేషం. అంతే కాకుండా నాగార్జున నాగార్జున‌ బాలీవుడ్‌లో నటించిన ఖుదాగ‌వా సినిమాలో న‌టించింది. ఈ సినిమా తెలుగులోకి కొండ‌వీటి సింహాం పేరుతో డబ్‌ చేశారు. 2000 సంవత్సరంలో చివరిసారిగా గ‌జ‌గామిని అనే హిందీ చిత్రంలో కనిపించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)