Breaking News

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట

Published on Sat, 01/11/2025 - 13:27

సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు (Nampally Court ) ఊరట కల్పించింది. పలు షరతులతో ఆయనకు ఇప్పటికే  రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు తాజాగా వాటిలో సడలింపు ఇచ్చింది. పోలీసులు  చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు  చిక్కడపల్లి పోలీసుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో బన్నీకి కోర్టు మినహాయింపు ఇచ్చింది.

అల్లు అర్జున్‌ (Allu Arjun) గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా అక్కడికి వెళ్లారు. దీంతో కాస్త ఇబ్బంది వాతావరణం అక్కడ కనిపించింది. ఇలాంటి సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి స్టేషన్‌కు వెళ్లడం వల్ల సెక్యూరిటీ పరంగా పలు ఇబ్బందులు వస్తున్నాయని కోర్టులో ఆయన పిటిషన్‌ పెట్టుకున్నారు. తాజాగా విచారించిన న్యాయస్థానం బన్నీకి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం కోరింది.

(ఇదీ చదవండి: 'గేమ్‌ ఛేంజర్' కలెక్షన్స్‌ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు)

పుష్ప–2 ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ కారణం అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూ­రు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌ (చిక్కడపల్లి)లో హాజరు కావా­లని ఆదేశించింది. అయితే, ఇప్పుడు ఈ అంశంలో ఆయనకు సడలింపు ఇచ్చింది.

డిసెంబర్‌ 5న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీతేజ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ పరామర్శించి వచ్చారు. బాలుడికి కావాల్సిన వైద్య సదుపాయం అల్లు అర్జున్‌ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ప2 చిత్ర యూనిట్‌ రూ. 2 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)