Breaking News

మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్‌ అసభ్యకర వ్యాఖ్యలు

Published on Sun, 01/12/2025 - 21:02

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్‌ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

హీరోయిన్‌ ఓ రేంజ్‌లో..
ముందుగా  త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ హీరోయిన్‌ మజాకాలో హీరోయిన్‌గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. 

నేనే చెప్పా..
అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్‌ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌ శరీరం గురించి డైరెక్టర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.

కావాలనే..
ఇక ఇదే ఈవెంట్‌లో సెకండ్‌ హీరోయిన్‌ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్‌ ఇవ్వమని కొంత గ్యాప్‌ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్‌ ఓవరాక్షన్‌ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

 

చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్‌ అయినా ముందే చెప్పాలిగా

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)