Breaking News

ముగ్గురు ఫ్రెండ్స్‌తో ఎన్నో కొంటె పనులు చేశా: నాగార్జున

Published on Wed, 02/22/2023 - 18:25

సాక్షి, హైదరాబాద్‌: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ స్కూల్ లోకి రాగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి' అన్నారు కింగ్‌ నాగార్జున. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాల్లో బుధవారంన ఆడు నాగార్జునతో పాటు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్‌ మాట్లాడుతూ.. 1976లో నేను ఇందులో చదువుకున్నా. ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. ఆ రోజుల్లో నాతో పాటు చదివిన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్నో కొంటె పనులు చేశాం. నాతో పాటు చదివిన వారందరు  లాయర్లుగా, జడ్జిలుగా , బిజినెస్‌మెన్స్‌గా గొప్ప స్థాయిలో ఉన్నారు.

స్కూల్‌లో నాగార్జున పేరుతో ఒక బిల్డింగ్  ఉండడంతో అందరు నా పేరు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యేవారు. నా పేరు చెప్పినప్పుడల్లా నాగార్జున నీ పేరా? బిల్డింగ్ పేరా? అని అడిగే వారు. మా ఇల్లు పక్కనే ఉండేది. కొన్ని సార్లు నడుచుకుంటూ, మరికొన్ని సార్లు సైకిల్ మీద వచ్చేవాన్ని. స్కూల్‌లోకి ఎంటర్ అవగానే ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. కాగా 1923లో బేగంపేట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. 2023తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది మొత్తం వంద సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తోంది. నగర్ కమీషనర్ సీవీ  ఆనంద్, హీరో నాగార్జున, అడోబ్ సీఈఓ శాంతను నరేన్ పలువురు ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)