Breaking News

నా కెరీర్‌లో శివ ప్రత్యేకం: నాగార్జున

Published on Fri, 11/28/2025 - 00:12

‘‘నా కెరీర్‌లో ‘శివ’ సినిమా చాలా ప్రత్యేకం. అలాగే ‘గీతాంజలి’ చిత్రం కూడా. ‘శివ’ లాంటి సినిమా మళ్లీ ఇప్పుడు వస్తుందా? అంటే చెప్పలేను. అప్పట్లో జరిగిపోయిందంతే’’ అని హీరో నాగార్జున చెప్పారు. గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇఫీ (ఇంటర్‌నేషనల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా నటించిన ‘శివ, గీతాంజలి’ సినిమాలు ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్పెషల్‌ స్క్రీనింగ్‌ అయ్యాయి. ‘ప్రిజర్వింగ్‌ ది క్లాసిక్స్‌: ది జర్నీ ఆఫ్‌ శివ’ కార్యక్రమంలో భాగంగా నాగార్జున గోవా వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ –‘‘శివ’ 36 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటి సినిమాలానే ఉంటుంది.

కేవలం యాక్టింగ్‌ పరంగానే కాదు.. సౌండ్‌ డిజైన్ , కెమెరా వర్క్, లైటింగ్‌  ఫ్యాట్రన్ , డైరెక్షన్  బ్రిలియన్సీ... ఇలాంటి అంశాలు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. ఇలా టెక్నికల్‌ పరంగానూ ఈ సినిమా ఇప్పటికీ రిలవెంట్‌గానే ఉంటుంది. ఇది నా ప్రామిస్‌. ‘శివ 4కె’ వెర్షన్  స్క్రీనింగ్‌ కోసం వచ్చిన మీ అందరికీ (వీక్షకులను ఉద్దేశిస్తూ...) ధన్యవాదాలు’’ అన్నారు. దివంగత ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వైకుంఠ్‌ బాబ్‌ శత జయంతి వేడుకలు ‘ఇఫీ’లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పేరిట ఓపోస్టల్‌ స్టాంప్‌ని విడుదల చేశారు.
 

Videos

డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్

హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

KTR : కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది

ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి

దివ్యాంగులపై జోకుల కేసులో సమయ్ రైనాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

బుర్రుందా..! మీలాంటోళ్ళు డిప్యూటీ సీఎంలు... పవన్ కామెంట్స్ కు జగదీశ్ రెడ్డి కౌంటర్

95 వేల సంతకాలు పూర్తి YSRCP నేతలకు అవినాష్ అభినందనలు

పోలీసుల దర్యాప్తు తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం

AP: సాయం కోసం మంత్రి వద్దకు వెళ్తే మరింతగా వేధించారు: మహిళలు

Heavy Rain: దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం

Photos

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)