Breaking News

తండ్రీ కొడుకులు

Published on Tue, 06/17/2025 - 00:25

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన అక్కినేని నాగార్జున, అఖిల్‌ వెండితెరపైనా తండ్రీ కొడుకులుగా స్క్రీన్  షేర్‌ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. అఖిల్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్  లవ్‌స్టోరీ చిత్రం ‘లెనిన్ ’. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నాగార్జున నటించనున్నారనీ, కథ రీత్యా అఖిల్‌ పాత్రకు తండ్రి పాత్రలో కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది.

ఇదే వాస్తవమైతే... నిజ జీవితంలో తండ్రీకొడుకులైన నాగార్జున, అఖిల్‌ సిల్వర్‌ స్క్రీన్ పై కూడా తండ్రీకొడుకులుగా కనిపించినట్లవుతుంది. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల పెళ్లి చేసుకున్న అఖిల్‌ అతి త్వరలోనే ‘లెనిన్ ’ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని, ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ తిరుపతిలో ప్రారంభం అవుతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రం నవంబరులో రిలీజ్‌ కానుందని సమాచారం. ఈ సినిమాకు తమన్  సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మనం’ సినిమాలో అఖిల్‌ ఓ చిన్న పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)