Breaking News

రూ.100 కోట్లతో నాగార్జున 100వ సినిమా.. డైరెక్టర్‌ ఎవరంటే?

Published on Wed, 03/19/2025 - 17:44

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌.. ఈ నలుగురిని టాలీవుడ్‌కి నాలుగు స్తంభాలు అంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక సినిమాలలో హీరోలుగా నటించింది వీరే. చిరంజీవి ఇప్పటికే 156 చిత్రాలకు పైగా నటించగా.. బాలకృష్ణ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు నాగార్జున(Nagarjuna) తన 100వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హీరోగా 99 చిత్రాల్లో నటించిన నాగ్‌.. తన సెంచరీ మూవీ కోసం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.

నాగ్‌ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం  'నా సామి రంగ'. ఇది గతేడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజైంది. ఆ త‌ర్వాత సోలో సినిమా ఇంత వ‌ర‌కూ ప్రకటించలేదు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది

ప్రస్తుతం నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కార్తీక్ గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిందట. వెంటనే అతన్ని పిలిపించి..వందో చిత్రం బాధ్యతలు అప్పజెప్పాడట.

తన 100వ  విజువల్ వండర్‌గా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగ్ కోరుకుంటున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.  నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జ‌గ‌న్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి.. అయితే, తాజా సమాచారం ప్రకారం కార్తీక్‌తోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు కనిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. నాగ్‌ అభిమానులకు ఆకట్టుకునేలా ఓ సూపర్‌ స్టోరీని రెడీ చేశాడట కార్తీక్‌. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో  పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)