Breaking News

అఖిల్‌ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున

Published on Sun, 08/17/2025 - 11:29

గత కొంతకాలంగా విజయాల్లేక తడబడుతున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది వరుస హిట్లు వచ్చాయి. నాగచైతన్య తండేల్‌ సినిమాకు వంద కోట్లు రాగా, నాగార్జున (Nagarjuna Akkineni) కుబేర చిత్రానికి రూ.132 కోట్లు వచ్చాయి. అలా తండ్రీకొడుకులిద్దరూ ఈసారి సెంచరీ కొట్టారు. అఖిల్‌ అక్కినేని మాత్రం ఈ రేసులో ఎక్కడో ఆగిపోయాడు. ఏజెంట్‌తో డిజాస్టర్‌ అందుకున్న ఇతడు ప్రస్తుతం లెనిన్‌ మూవీ చేస్తున్నాడు.

టాక్‌ షోలో నాగ్‌
దీన్ని నాగవంశీతో కలిసి నాగార్జున నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అఖిల్‌కు తండ్రిగా కనిపించనున్నారన్న టాక్‌ కూడా వినిపించింది. ఈ మూవీలో నటించేందుకు జగపతిబాబుకు ఆఫర్‌ ఇస్తే.. దానికి నాగ్‌ ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని ఆయన జయమ్ము నిశ్చయమ్మురా టాక్‌ షోలో వెల్లడించాడు. ఈ షోకు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 

అవును, రిజెక్ట్‌ చేశా..
జగ్గూ భాయ్‌ మాట్లాడుతూ.. అఖిల్‌ (Akhil Akkineni) రీసెంట్‌ సినిమా(లెనిన్‌)లో ఏదో చిన్న పాత్రకు నన్ను అడిగారట! ఇంత చిన్న క్యారెక్టర్‌కు ఆయన్ను అడగడమేంటి? మేం కలిసేదే తక్కువ. ఇలాంటివి చేస్తే మా స్నేహమే చెడిపోతుంది అన్నావంట కదా అని అడిగాడు. అందుకు నాగ్‌.. అవును, ఆ చిన్న పాత్రకు నువ్వెందుకని తిరస్కరించాను అని చెప్పాడు. దీంతో జగపతిబాబు థాంక్యూ చెప్తూ.. నిజానికి నీకసలు సంబంధం లేదు. ఆ సినిమాకు నీతోపాటు మరో నిర్మాత కూడా ఉన్నారు. 

ముందు మనం ఫ్రెండ్స్‌
నువ్వు విలువల్ని పాటిస్తావు.. అది నాకెంతో ఇష్టం అన్నాడు. అది వినగానే నాగ్‌.. వీటన్నింటికంటే ముందు మనమిద్దరం ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చాడు. లెనిన్‌ విషయానికి వస్తే.. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్‌ కిరణ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)