Breaking News

ఆ రోజు నాన్నగారు చెప్పిందే నిజమైంది: నాగార్జున

Published on Sun, 10/06/2024 - 11:27

టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.

నాగార్జున తన ట్వీట్‌లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్‌ఆర్‌ కలిసి కారులో డ్రైవింగ్‌ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్‌హిట్‌ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.

నాగార్జున పోస్ట్‌కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్‌, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌