Breaking News

కింగ్‌ 100 నాటౌట్‌!

Published on Wed, 05/14/2025 - 00:25

కొన్ని రోజులుగా తన వందో సినిమా కోసం నాగార్జున కథలు వింటున్నారు. ఈ క్రమంలో నాగార్జున వందో సినిమాకు ఈయనే డైరెక్టర్‌ అంటూ పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్‌.ఎ. కార్తీక్‌ చెప్పిన కథ నాగార్జునకు నచ్చిందని సమాచారం. దీంతో కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట కార్తీక్‌. 

ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ అతి త్వరలో పూర్తి స్థాయిలో మొదలవుతాయని, ‘కింగ్‌ 100 నాటౌట్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని టాక్‌. ఇక నాగార్జునను అభిమానులు ‘కింగ్‌’ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నూరవ చిత్రానికి ‘కింగ్‌ 100 నాటౌట్‌’ అనే టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే... రజనీకాంత్‌ తాజా చిత్రం ‘కూలీ’, ధనుష్‌ ‘కుబేర’ సినిమాల్లో నాగార్జున లీడ్‌ రోల్స్‌ చేశారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ జూన్‌ 20న, లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోని ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న రిలీజ్‌ కానున్నాయి.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)