Breaking News

నాగబంధం టీజర్‌ రిలీజ్‌.. దర్శకుడు ఎమోషనల్‌ నోట్‌

Published on Sun, 02/15/2026 - 10:25

‘పెద్ద కాపు’ ఫేమ్‌ విరాట్‌ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘నాగబంధం’. అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా నేడు(ఫిబ్రవరి 15)  ఉదయం 11:11 గంటలకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు చేతుల మీదుగా ఈ మూవీ టీజర్‌ విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు అభిషేక్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ నోట్‌ విడుదల చేశాడు. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని.. టీజర్‌ నచ్చితే  మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే అవుతుందంటూ ఓ సుదీర్ఘమైన లేఖను విడుదల చేశాడు. 

ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని ఆశీస్సులతో మా చిత్రానికి సంబంధించిన వరల్డ్‌ ఆఫ్‌ నాగబంధం ఫస్ట్‌ టీజర్‌ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ చిత్రం కేవలం రాసుకున్న కథ కాదు, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని గాథ. ఈ కథను పూర్తిగా తెలుసుకొని రాయడానికి ఏన్నో నెలలు పట్టింది. ఈ కథ పూర్తిగా రాసిన తరువాతే ఊపిరిపీల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్చబ్దాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాతుల్రను గడిపాము.

ఒక దర్శకుడిగా చెప్పాలంటే..ఈ టీజర్‌ అనేది విజువల్‌ మాత్రమే కాదు. అది మా ఊపిరిలో దాగిఉన్న శ్వాస. చాలాకాలం మా అంతరాత్మలో దాచుకొని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం. మీరు చూసే ప్రతీ ఫ్రేమ్‌లోనూ మా కష్టం ఉంది. అది మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం, సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది.

అలసిపోయిన రాత్రులు గడిపాము, ప్రశ్నలతో నిండిన రోజులు చూశాం. అయినా మేము ఆ ప్రశ్నల లోతులోకి తొంగి చూసి, వాటిని ఛేదిస్తూ ముందుకు సాగాము. కథను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నమ్ముతున్నాము. ఆ మహాదేవునిపై ఉన్న దైవభక్తి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది.

మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా నిలిచిన మా నిర్మాతలు నిషిత, కిషోర్‌ గ్లారకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు చూపించిన స్నేహపూర్వకమైన నమ్మకమే నా ధైర్యం. వారు నాకు చ్చిన ప్రోత్సాహమే నా బలం. ఇక మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, రానా దగ్గుబాటి గారి ప్రోత్సాహం, ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇచ్చిన సపోర్ట్‌ మాటల్లో చెప్పలేను. రాతల్లో రాయలేను. 

మేము కోరుకునేది ఒక్కటే స్వచ్ఛమైన మనస్సుతో ఈ టీజర్‌ను వీక్షించండి. మీ మనస్సును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే. చివరిగా మీరు చూపించే ఆదరణే మా ఆయుధం. ఆ ఆయుధమే ఈ చిత్ర విజయానికి బాటలు వేసేలా చేస్తుందని భావిస్తున్నా’ అని అభిషేక్‌ నామా రాసుకొచ్చాడు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)