Breaking News

మెగా బ్రదర్‌ నాగబాబు చేతికి గాయం.. ఆయనకు ఏమైంది?

Published on Fri, 09/23/2022 - 09:14

మెగా బ్రదర్‌ నాగబాబు కొణిదెల చేతికి గాయమైంది. నాగబాబు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసిన తాజా వీడియోలో ఆయన చేతికి కట్టు వేసుకుని కనిపించారు. దీంతో ఆయన చేయి ఫ్యాక్షర్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు ‘ముల్లును ముల్లుతోనే తియాలంటే ఇదేనేమో.. అయితే ఇది ఎవరూ ఇంట్లో ట్రై చేయకండి. నిపుణురాలు డా.నీహారిక పర్యవేక్షణలో జరిగింది’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చాడు ఆయన. ఈ వీడియోలో తండ్రితో పక్కనే కూర్చుని ఉన్న నిహారిక సైలెంట్‌గా అల్లరి చేస్తోంది. తండ్రి గడ్డాన్ని నిమురుతూ ‘నొప్పిగా ఉందా నాన్న.. ఆ నొప్పి నేను తీసేయనా’ అంటుండగా.. పెద్ద పెద్ద డాకర్ట్స్‌ వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది అంటాడు నాగాబాబు. 

చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్‌.. నటుడు ప్రభాకర్‌ షాకింగ్‌ రియాక్షన్‌

‘నేను తీసేస్తా అంటున్నా కదా.. ఆ నొప్పి తీసేస్తా’ అంటూ నిహారిక తండ్రి చేయి పట్టుకుని గట్టిగా కొరికింది. ఆ నొప్పి భరించలేక నాగబాబు ఒక్కసారిగా గట్టిగా ఆరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ తండ్రి కూతుళ్ల బాండింగ్‌కు మెగా ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు చేతికి ఏమైంది? ఆ గాయం ఎలా అయ్యిందనేది క్లారిటీ లేదు. దీంతో ఆయనకు ఏమైందా? అని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. హీరోయిన్‌ గురించి ఏమన్నదంటే..

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)