Breaking News

'పవన్‌ కల్యాణ్‌ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్‌ తిరిగి నిలబెట్టాడు'

Published on Wed, 10/04/2023 - 09:10

పవన్‌కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన 'అజ్ఞాతవాసి'  2018 జనవరిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కింది. ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు లేక కొన్నిచోట్ల మొదటి రెండురోజుల్లోనే ఈ సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.  అలా ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వచ్చాయి. కొన్ని చోట్ల తమన ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కూడా రోడ్డెక్కారు. ఆ సినిమా తర్వాత పవన్‌ కూడా సుమారు 3 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు. మళ్లీ 2021లో 'వకీల్‌సాబ్‌'గా కనిపించాడు.

దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన సంగతి పంచుకున్నారు. అజ్ఞాతవాసి పోయాక ఆ బాధలోనే టీమ్ రెండు నెలలు గడిపేసిందని ఆయన చెప్పాడు. భారీ అంచనాలతో జనవరిలో రిలీజైన ఈ సినిమా ఫలితం చూశాక తప్పెక్కడ జరిగిందో ఎవరికీ  అంతు చిక్కని పరిస్థితి అయింది. అలా ఒకరకమైన డిప్రెషన్‌లో ఉండగా తమకు జూ. ఎన్టీఆర్‌ ధైర్యం ఇలా ఇచ్చారని నాగవంశీ చెప్పాడు.

'వెంటనే ఆ మూడ్‌లో నుంచి బయటికి వచ్చేయమని, ఇదే సంవత్సరం మనం హిట్టు కొడుతున్నామని చెప్పి 'అరవింద సమేత వీర రాఘవ'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా త్రివిక్రమ్- తారక్‌ కాంబోలో తక్కువ రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాం. దీంతో హారిక & హాసినీ ఇండస్ట్రీలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది.' అని  ఒక జాతీయ వెబ్ వీడియో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ పంచుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ' 2018 అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్‌)

ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తమకు ఇలాంటి సంఘటనలో  ఎన్నో ఎదరయ్యాయని అన్నీ బహిరంగంగా చెప్పుకోలేమని ఆయన  చెప్పాడు. నాగవంశీ సోదరి హారిక నిర్మించిన ‘మ్యాడ్‌’ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్‌ శంకర్‌ దీనిని తెరకెక్కించారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)